మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపి MLA శ్రీ దేవి తీవ్రంగా మండిపడ్డారు

0
63
YCP MLA SRI DEVI

తుళ్ళూరు మండలం, అనంతవరంలో నిన్న జరిగిన ఘటన నేపద్యంలో మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు వైసీపి MLA శ్రీ దేవి. గణేష్ చవితిని పురస్కరించుకొని పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన శ్రీదేవిపై టీడీపీ నేతలు అభ్యంతకరంగా మాట్లాడారు. కుల రాజకీయాలు చేస్తున్నారు అని, కక్ష్య సాధింపు చర్యలు పలుపడుతున్నారు అని విమర్శించారు. కులం పేరుతో దూషించిన ఆ నలుగురు వెనుక చంద్రబాబు ఉన్నారు అని ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. నేను, నా భర్త అన్ని మతాలను గౌరవిస్తాం అని శ్రీ దేవి అన్నారు. నా భర్త కాపు సామాజిక వర్గానికి చెందినా వ్యక్తీ నేను దళితురాలిని అని భయపెట్టాలని చూస్తున్నారు. దళితులు అంటే టీడీపీ నేతలకు చిన్న చూపు అని అని MLA శ్రీ దేవి ఆరోపణలు చేశారు.