నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. లబ్బీపేటలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో అవతరణ దినోత్సవ వేడుకలు జరపనున్నారు. సాయంత్రం జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు మంత్రులు వేడుకల్లో పాల్గొననున్నారు. స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులను, బంధువులను సత్కరించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.