పవన్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కి టీడీపీ పార్టీ మద్దతు

0
35
TDP Party support for Pawan's Long March

విజయవాడ: విజయవాడ పర్యటనలో వైసీపీ ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 22 రకాల వృత్తులవారు ఉపాధి లేక రోడ్డున పడ్డారు అని, భాధితులపై వైసీపీ ప్రభుత్వం ఎగతాళి చేస్తున్నారు అని వ్యాక్యానించారు. ఇసుక లేక ఆత్మహత్య చేసుకున్న వారిపై ఈ ప్రభుత్వం కాలంచెల్లి చనిపోయారు అని వైసీపీ మంత్రులు ఆవహేళన చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఇసుక లేక, పనులు లేక కుటుంబాన్ని పోసించలేక కార్మికులు చనిపోతున్నారు, దీనికి కారణం వైసీపీ ఆధిపత్య విధానమే అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పవన్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కి టీడీపీ పార్టీ మద్దతు ఇస్తుంది అని,  ఇలాంటి భాధితుల విషయంలో ఎవరు నిరసన చేసిన టీడీపీ పార్టీ మద్దతిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు.