తమిళ తమ్ములను నిరాశపరిచిన తలైవాస్

0
80
Tamil thalaivas vs Bengaluru

ప్రో కబడ్డీ లీగ్  సీజన్ 7 సొంతగడ్డపై ఆడిన మొదటి మ్యాచ్‌లోనే  తమిళ తలైవాస్ తన అభిమానులను నిరాసకు గురిచేసింది. చెన్నై వేదికగా బెంగళూరు బుల్స్‌తో  శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తమిళ తలైవాస్ 21-32 తేడాతో పేలవంగా ఓడిపోయింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఫేయిలవగా, మరో రైడర్ అజయ్ ఠాగూర్ కూడా విఫలం కావడంతో తమిళ తలైవాస్ కి పరాజయం తప్పలేదు. కానీ బెంగళూరు బుల్స్‌ మాత్రం మంచి ఆలరౌండ్ ప్రతిభ చూపించింది. రైడ్ పాయింట్స్ 15, ట్యాకిల్ పాయింట్ 10, అదనపు పాయింట్ 3,  ఆలౌట్ పాయింట్స్ మాత్రం 4సార్లు చేసింది. దీనితో ఆటముగిసే టైంకి బెంగళూరు బుల్స్ 32 పాయింట్స్ చేసింది. తమిళ తలైవాస్ మాత్రం రైడ్ పాయింట్స్ 15, ట్యాకిల్ పాయింట్ 6 మాత్రమే చేశారు. దీనితో  తమిళ తలైవాస్ ఆటముగిసే టైంకి 21 పాయింట్స్ మాత్రమే చేయటం వల్ల సొంత మైదానంలో కూడా ఓటమి తప్పలేదు.