బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెలా గోపిచంద్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

0
88
Pullela Gopichand birthday special

పుల్లెలా గోపిచంద్ నవంబర్ 16, 1973 లో  పుల్లెల సుబాష్ చంద్ర మరియు సుబ్బరవమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నాగండ్లాలో జన్మించారు. పుల్లెలా గోపిచంద్ కి మొదట్లో క్రికెట్ అంటే బాగా ఇష్టం, కానీ అతని అన్నయ్య బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకోవడానికి ప్రోత్సహించడం వల్ల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గా క్యారియర్ మొదలుపెట్టారు. ప్రస్తుతం, అతను భారత బ్యాడ్మింటన్ జట్టుకు చీఫ్ నేషనల్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అతను 2001 లో ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు, ప్రకాష్ పడుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడు పుల్లెలా గోపిచంద్. బ్యాడ్మింటన్ నుండి రిటైర్ అయిన తరువాత, 2008 లో గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించాడు. ఈ అకాడమీలోనే సైనా నెహ్వాల్, పి. వి. సింధు, సాయి ప్రణీత్, పరుపల్లి కశ్యప్, శ్రీకాంత్ కిడాంబి, అరుంధతి పాంటవానే, గురుసాయ్ దత్ మరియు అరుణ్ విష్ణులతో సహా అనేక మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను తాయారు చేసారు. సైనా నెహ్వాల్ 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, పి.వి.సింధు 2016 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజత పతకం. గోపీచంద్ 2016 బ్రెజిల్ రియో ​​ఒలింపిక్‌లో అధికారిక భారత ఒలింపిక్ బ్యాడ్మింటన్ జట్టు కోచ్‌గా కూడా పనిచేశారు. అతని క్రీడా ప్రతిభకు భారత ప్రభుత్వం 1999 లో అర్జున అవార్డు, 2001 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2005 లో పద్మశ్రీ, 2009 లో ద్రోణాచార్య అవార్డు, 2014లో పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది.