Home Blog Page 6

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ఉధృత

0
Inflow of Sriram Sagar

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ఉధృత. మహారాష్ట్ర నుంచి భారీగా చేరుతున్న వరద నీరు, అధికారులు 12 గేట్లు ద్వారా నీటిని కిందకు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఇన్ ఫ్లో 45 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది, ఔట్ ఫ్లో 45 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

నారాయణపూర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద ఉధృత

0
Outflow from Narayanpur increased

యాదగిరి: నారాయణపూర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద ఉధృత. అధికారులు 21 గేట్లు ద్వారా నీటిని కిందకు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది, ఔట్ ఫ్లో 2.31 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 490.2 మీటర్లు, ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 492.25 మీటర్లు.

జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ఉధృత

0
Jurala Project Telangana

మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ఉధృత. అధికారులు 6 గేట్లు ద్వారా నీటిని కిందకు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది, ఔట్ ఫ్లో 2.31 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 313.349 మీటర్లు, ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు.

నవంబర్ లో సెట్స్ పైకి మెగాస్టార్ చిరు మూవీ

0
Ram Charan Movie With Koratala Siva After Chiranjeevi

ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తరువాత సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి  తన తరువాత సినిమా కొరటాల దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాసం ఉంది అని, ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహిరిస్స్తున్నారు అని టాలీవుడ్ సమాచారం. కొరటాల శివ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కచ్చితంగా ఉంటాడు. ఎందుకు అంటే కొరటాల తీసిన మొట్టమొదటి సినిమా మిర్చి నుంచి రీసెంట్ గా తీసిన మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీ వరకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ చేసాడు. కానీ ఈ సినిమాలో బాలీవుడ్ కానీ ఈ సినిమాలో బాలీవుడ్ మ్యూజిక్  డైరెక్టర్ అజయ్, అతుల్ తీసుకోవాలని చూస్తున్నారు అని సమాచారం.

ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తరంగా కురుస్తున్న వర్షాలు

0
Rain in Rajamahendravaram

రాజమహేంద్రవరం: జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి విస్తరంగా కురుస్తున్న వర్షాలు. దేవీపట్నం, కచ్చులూరు ప్రాంతాల్లలోను వర్షం పడటం వల్ల గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈరోజు కచ్చూలురులో బోటు బయటకు లాగేందుకు ప్రయత్నించనున్న సత్యం, స్కూబా డైవర్స్ బృందాలు. ఈరోజు కచ్చితంగా బోటును బయటకు తీస్తామని అని చెప్పిన సత్యం టీం, కానీ బోటు ముక్కలు ముక్కలుగానే బయటకు వచ్చే అవకాసం ఉంది, ఒకవేళ ఈరోజు బోటు బయటకు రాకపోతే విశాఖ స్కూబా డైవర్స్ బృందం వెనుతిరిగే అవకాశాలు ఉన్నాయి అని అధికారులు తెలిపారు.

బోయినపల్లి లో భారీ చోరీ చేసిన దండుగులు

0
Gold and Money

హైదరాబాద్: రంగారెడ్డి రెడ్డి జిల్లాలోని బోయినపల్లి మల్లికార్జున నగర్ లో భారీ చోరీ చేసిన దండుగులు. ఈ చోరీలో సుమారు 3.5 కిలోల బంగారం, రు.18 లక్షల నగదు అపహరించారు అని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరు లేని సమయలో చోరీకి పాల్పడిన దండుగులు. దండుగులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినా పోలీసులు. సీసీ టీవీ ఆధారంగా దండుగులను తొందరగా పట్టుకుంటామని అని బోయినపల్లి ఎస్ఐ తెలిపారు.

ఏపీలో భీమ సౌకర్యం కల్పించేందుకు యాక్సస్ బ్యాంకు ముందుకు

0
Gautam Sawang in bhima in home guard

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డులకు భీమ సౌకర్యం కల్పించేందుకు యాక్సస్ బ్యాంకు ముందుకు రావడం చాల సంతోషంగా ఉంది అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. హోంగార్డులు, పోలీసులు ప్రమాదంలో చనిపోయిన వారికి రు. 40 లక్షలు భీమా, పూర్తిగా అంగవైకల్యం కలిగితే రు.30 లక్షల భీమా వర్తిస్తుంది అని తెలిపారు. ఈ భీమా ద్వారా రాష్ట్రా వ్యాప్తంగా 15 వేల మంది హోంగార్డులకు, 72 వేల మంది పోలీసులకు వర్తిస్తుంది. పోలీసులకు ఆరోగ్య భద్రతలో హోంగార్డులకు భాగస్వామ్యంపై ఆలోచనలు చేస్తున్నాము అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

ఈరోజు చంద్రగిరిలో వైభవంగా పవిత్ర సమర్పణ

0
PAVITRA SAMARPANA IN CHANDRAGIRI RAMALYAM

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. నిన్న వెంకటేశ్వర స్వామిని 83,343 మంది దర్శించుకున్న భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రు.3.15 కోట్లు  వచ్చింది అని అధికారులు చెప్పారు. తిరుమలలో అధిక వర్షాలకు జలాశయాల్లో నీటి మట్టం పెరిగింది, కళ్యాణి డ్యామ్ నీటి సామర్థ్యం 5,047 మిలియన్ లీటర్లు, ప్రస్తుతం 2,684 నీరు నిల్వ ఉంది అని అధికారులు వెల్లడించారు.

కాకతీయ కెనాల్ కు నీటిని విడుదల చేసిన అధికారులు

0
Sriram Sagar project

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృత. 12 గేట్లు ద్వారా నీటిని కిందకు వదులుతున్న అధికారులు. ఎగువ నుంచి ఇప్పటి వరకు ఇన్ ఫ్లో 48,050 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది, ఔట్ ఫ్లో 45,500 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.313, కాకతీయ కెనాల్ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీరును విడుదల చేసిన అధికారులు, ఈ కాకతీయ కెనాల్ ద్వారా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మూడు జిల్లాకు వ్యవసాయానికి లబ్ధి చేకురనుంది.

ఫాలో ఆన్ ఆడనున్న సౌత్ఆఫ్రికా

0
India vs South Africa 3rd Test

రాంచీ టెస్ట్ లో మరో సరి బౌలర్ల రాణించడం వల్ల సౌత్ఆఫ్రికా 162 పరుగులకు  ఆలౌట్ చేసిన భారత్. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 497 పరుగులకు డిక్లేర్ చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన సౌత్ఆఫ్రికా ఆదిలోనే 2 వికెట్స్ ని కోల్పోయింది. సౌత్ఆఫ్రికాలో జుబైర్ హమ్జా 62(79), టెంబా బావుమా 32(72), జార్జ్ లిండే 37(81) పరుగులు తప్ప ఎవరు చెప్పుకోతగ్గ తగ్గ స్కోర్ చేయలేదు. ఈ టెస్ట్ ఉమేష్ యాదవ్ 3 కీలక వికెట్ తీసి సౌత్ఆఫ్రికా స్కోర్ ని కట్టడి చేసాడు. షామీ, నదీం, జడేజాకు తలో రెండు వికెట్స్ దక్కాయి. తక్కువ స్కోర్ కి భారత్ ఆలౌట్ చేయడం ద్వారా ఫాలో ఆన్ ఆడనున్న సౌత్ఆఫ్రికా.

Latest News