Home Blog Page 4

గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ v/s హర్యానా స్టీలర్స్

0
Gujarat Fortunegiants and Haryana Steelers

ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ v/s హర్యానా స్టీలర్స్ ఈ రోజు తలబడుతున్నాయి. పోయిన మ్యాచ్ లో విజయం సాదించిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు ఈరోజు హర్యానా స్టీలర్స్ పై కూడా ఎలాగా అయిన గెలవాలని చూస్తుంది. సునీల్ కుమార్, రోహిత్ గులియా, హర్మంజిత్ సింగ్, పర్వేష్ భైన్స్వాల్ మంచి ప్రదర్శన చేస్తే హర్యానా స్టీలర్స్ పై గెలిచే అవకాశం ఉంది గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో లో కొనసాగుతుంది.అయితే హర్యానా స్టీలర్స్ మాత్రం వరుసగా రెండు విజయాలతోమంచి ప్రదర్శన చేస్తుంది. గుజరాత్ పై కూడా గెలిచి తన జైత్రయాత్ర కొనసాగించాలి అని హర్యానా స్టీలర్స్ చూస్తుంది. రైడర్స్ గా వికాష్ కండోలా (69), నవీన్, మొహమ్మద్ మలేకి, డిఫెండర్స్ గా ధర్మరాజ్ చెరలథన్(22), సునీల్ రానిస్తే హర్యానా స్టీలర్స్ గెలిచే అవకాశాలుఎక్కువగా ఉన్నాయి. హర్యానా స్టీలర్స్ పాయింట్స్ పట్టికలో 5వ స్థానంలో లో కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం 7:౩౦ స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.

యోగా భంగిమలో ప్రాక్టీస్ చేస్తు 80 అడుగుల నుంచి పడిపోయిన విద్యార్థిని

0
Woman Falls 80 Feet

మెక్సికోలోని ఒక కళాశాల విద్యార్థిని శనివారం ఆమె 80 అడుగుల నుంచి పడిపోయింది. అలెక్సా టెర్రాజా శాన్ పెడ్రోలోని తన ఆరవ అంతస్తుల అపార్ట్మెంట్ బాల్కనీ అంచున యోగా భంగిమలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆమె సమతుల్యతను కోల్పోయి పడిపోయినట్లు డైలీ మెయిల్ తెలిపింది. తలక్రిందులుగా స్టంట్ చేస్తున్నప్పుడు ఈ గాటన జరిగింది.
ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాక డాక్టర్స్ పదకొండు గంటల పాటు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఆమె మోకాలు బాగా దెబ్బతినడం వల్ల ఆమె మూడు సంవత్సరాలు నడవలేకపోవచ్చు అని వైద్యులు చెపుతున్నారు. ఆమె 80 అడుగుల నుంచి పడిపోవడం వల్ల సుమారు 110 ఎముకలు విరిగిపోయాయి, ఆమె కాళ్ళు మరియు చేతులు రెండింటికీ పగుళ్లు, అలాగే ఆమె పండ్లు మరియు తల కూడా ఎక్కువ గాయాలు అయ్యాయి అని డాక్టర్స్ నివేదించారు. Ms టెర్రాజా కుటుంబం సభ్యులు సోషల్ మీడియాలో రక్తదానం చేయమని విజ్ఞప్తి చేశారు, గాయపడిన మహిళకు సహాయం చేయడానికి 100 మందికి పైగా రక్తదాతలు సంతకం చేశారని డైలీ మెయిల్ నివేదించింది. సోమవారం నాటికి, ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

యుకెలో తప్పిపోయిన ఖమ్మం విద్యార్ధి

0
Telangana BJP Leader Goes Missing In UK

హైదరాబాద్: తెలంగాణలోని ఖమ్మం జిల్లావాసి యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎంఎస్ చదువుతున్నఉజ్వాల్ శ్రీహర్ష (23) తప్పిపోయినట్లు అతని తండ్రి సోమవారం తెలిపారు. ఉజ్వాల్ శ్రీహర్ష మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎంఎస్ చదివేందుకు గత ఏడాది లండన్‌కు వెళ్లిన అతడు చివరిసారిగా ఆగస్టు 21 న తన తల్లితో మాట్లాడారని ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు మాట్లాడుదాం అని ఫోన్ చేస్తే కలవలేదు అని చెప్పారు. “అతను ప్రతిరోజూ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసేవాడు అని తన తండ్రి చెప్పారు”. ఉజ్వాల్ శ్రీహర్ష తప్పిపోయిన విషయాని తండ్రికి గత శుక్రవారం లండన్ పోలీసులు సమాచారం ఇచ్చారు. ఉజ్వాల్ శ్రీహర్ష బ్యాగ్ బీచ్ లో దొరికినట్లు లండన్ పోలీసులు తెలిపారు. అతను హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ కోసం లండన్ కి వెళ్ళాడు అని తన తండ్రి తెలిపారు. ఉజ్వాల్ శ్రీహర్ష శాస్త్రవేత్త కావాలని, ఇటీవల ఒక ప్రాజెక్ట్ పని కోసం జపాన్ కి వెళ్లారుని తన తండ్రి ప్రతాప్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి జి. కిషన్ రెడ్డి ఈ విషయంలో తప్పకుండా సహాయం చేస్తామని ఉదయ్ ప్రతాప్ హామీ ఇచ్చారు.

ఇంగ్లాండ్ మూడవ టెస్ట్ లో విజయం

0
stoke

ఇంగ్లాండ్: మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 179 పరుగులు చేసింది. తరువాత ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండుని 67 స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసింది ఆస్ట్రేలియా. అదే రోజు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగులో ఓపెనింగ్ చేసిన మార్నస్ లాబుస్చాగ్నే 19(39), డేవిడ్ వార్నర్ 0(2) ఎక్కువ స్కోర్ చేయకుండానే అవుట్ అయ్యారు. ఉస్మాన్ ఖవాజా 23(38), మార్నస్ లాబుస్చాగ్నే 80(187), ట్రావిస్ హెడ్ 25(56), మాథ్యూ వాడే 33(59) పరుగులు చేసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్ళారు. ఆస్ట్రేలియా 246 పరగులు చేసింది. ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్ కలిపి 358 పరుగుల టార్గెటును ఇంగ్లాండుకి ఇచ్చింది. సెకండ్ ఇన్నింగులో ఓపెనింగ్ చేసిన రోరే బర్న్స్ 7(21), జాసన్ రాయ్ 8(18) అవుట్ అవడంతో ఆదిలోనే ఇంగ్లాండుకి ఎదురు దెబ్బ తగిలింది ఎక్కవ పరుగులు చేయకుండానే ఆస్ట్రేలియా బౌలర్స్ అవుట్ చేశారు. తరువాత వచ్చిన రూట్ 77(205), డెన్లీ 50(155) ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యంతో స్కోర్ ని ముందుకు తీసుకోని వెళ్లారు. తరువాత వచ్చిన జానీ బెయిర్‌స్టో 36(68) పరుగులు చేసి అవుట్ అయ్యాడు, కానీ బెన్ స్టోక్స్ 135(219) ఒంటరి పోరాటం చేసి ఇంగ్లాండు విజయం సాదించడం లో కీలకపాత్ర వహించాడు. ఇంగ్లాండుకి ఇంకా ఒక వికెట్ ఉండగానే మూడవ టెస్ట్ లో విజయం సాదించింది. ఇంగ్లాండ్ 1-1 తో సిరీస్‌ను సమం చేసింది. నాలుగో టెస్ట్‌ మాంచెస్టర్‌ వేదికగా వచ్చే నెల నాలుగో తేదీ ప్రారంభమవుతుంది.

ప్రపంచ ఛాంపియన్‌షిపులో స్వర్ణ పతకం సాధించిన పివి సింధు

0
PV Sindhu

ఆదివారం జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2019 లో స్వర్ణ పతకం సాధించడానికి పివి సింధు 21-7, 21-7 తో జపాన్ నుంచి మూడో సీడ్ లో ఉన్న నోజోమి ఒకుహారా పై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదవ సీడ్ లో ఉన్న పివి సింధు 2017, 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మెరుగైన ప్రదర్శనలను చూసాము. అదే మెరుగైన ఆటతో మార్క్యూ టోర్నమెంట్‌ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న తొలి భారతీయురాలుగ పివి సింధు నిలిచింది. పివి సింధు మొదటి సెట్లో చెమట పట్టకుండా ఆటను 16 నిమిషాల్లో ముగించింది. మరోవైపు నోజోమి ఒకుహారాని, పివి సింధు ఛాంపియన్‌షిప్ ని కైవసం చేసుకోవడానికి ఆమెకు 38 నిమిషాలు పట్టింది. పివి సింధు ఫైనల్‌లో గెలవడానికి నోజోమి లోపాలను టార్గెట్ చేసి ఫైనల్ లో గెలిచింది. 2016 ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన సింధు, గతంలో ఇండోనేషియా ఓపెన్ 2019 లో జపానియులను ఓడించింది. ఆట ప్రారంభం నుంచి సింధు మ్యాచ్‌ను పూర్తిగా నియంత్రిచింది. ఆమె వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించింది. ఒకుహారా భారత ప్రత్యర్థికి ఎటువంటి తీవ్రమైన సవాలును ఇవ్వడంలో విఫలమైంది. రెండవ గేమ్‌లో,క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ 1 తాయ్ జూ యింగ్ ఓడించిన సింధు, ప్రారంభంలోనే తనఅధిపత్యం ప్రదర్శిస్తూ,వరుసగా ఏడు పాయింట్లు సాధించింది. దీనితో సింధు ఫైనల్‌ను సులభంగా గెలుచుకుంది.

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర , రాష్ట్రా ప్రభుత్వం మద్య వివాదం ఆగుతుందా?

0
polavaram reverse

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించనున్న పీపీఏ, బీజేపీ బృందం. అనంతరం పీపీఏతో భేటికానున్న జీవీఎల్, సోము వీర్రాజు పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చిస్తారు. పోలవరం పై రివర్స్ టెండరింగ్ నేపద్యంలో పీపీఏ, బీజేపీ పర్యటనకు ప్రాధాన్యత సంసరించుకుంది. అయితే రివర్స్ టెండరింగుకు వేళ్తే ఖర్చు భారీగా పెరుగుతుందని వాదిస్తున్న కేంద్రం అందుకే ఈరోజు పోలవరం పర్యటనకు వస్తున్నా పీపీఏ. రివర్స్ టెండరింగ్ వద్దంటున్న పీపీఏ, ఇ విధానం వల్ల కేంద్రం, రాష్ట్రా ప్రభుత్వల మద్య వాగ్దానం మొదలైనది.పోలవరంపై రివర్స్ టెండరింగుకు వేలుతాము అని జగన్ ప్రభుత్వం కరాకండిగా చెప్పింది. రివర్స్ టెండరింగ్ విధానంఫై కేంద్రానికి ఇప్పటికే అని వివరాలను సమర్పించామని  YCP MP విజయ సాయి రెడ్డి చెపుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి అన్ని వివరాలు అందిచము అని విజయ సాయి రెడ్డి అంటున్నారు. కేంద్ర అనుమతితోనే పోలవరంపై రివర్స్ టెండరింగుకు వేలుతము అని విజయ సాయి రెడ్డి చెపుతున్నారు. ఏది ఏమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలనీ కోరుకుంటున్నారు.

శ్రీలంక vs న్యూజిలాండ్ 2వ టెస్ట్

0
Latham

న్యూజిలాండ్: మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 244/10 స్కోర్ కి ఆలౌట్ అయింది. దిముత్ కరుణరత్నే 65(165), కుసల్ మెండిస్ 32 (70). ధనంజయ డి సిల్వా 109(148) ఫస్ట్ క్లాసు బ్యాటింగ్ తో ఫోర్ సింగిల్స్ ఆడుతూ సెంచరీ  చేసాడు. సెంచరీ చేసాక మంచి నిలకడ ఆడుతున్న ధనంజయ డి సిల్వా బౌల్ట్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. తరువాత వచ్చిన ఆటగాళ్ళు ఎవరు చెప్పుకోతగ్గ  స్కోర్ చేయలేదు. దానితో శ్రీలంకను 244 స్కోరుకే న్యూజిలాండ్ అలౌంట్ చేసింది. తరువాత బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ జీత్ రావల్, టామ్ లాతం ఓపెనింగ్ కి వచ్చారు. జీత్ రావల్ 0(9) వచ్చిన వెంటనే అవుట్ అయ్యాడు. టామ్ లాతం, కేన్ విలియమ్సన్ ఇద్దరు కలిసి స్కోర్ ని కొంచం ముందుకు తీసుకోని వెళ్లారు. కేన్ విలియమ్సన్ 20(28), రాస్ టేలర్ 23(43) అవుట్ అయ్యారు. ప్రస్తుతం  న్యూజిలాండ్  స్కోర్ 123/3 ఉంది. గ్రిజ్లో టామ్ లాతం 67(125), హెన్రీ నికోల్స్ 13(39) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. కొద్ది సేపు వర్షం వచ్చి మ్యాచ్ కు  అంతరాయం ఏర్పడింది. వర్షం ఆగితే మ్యాచ్ మళ్ళి స్టార్ట్ చేస్తారు.

మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక లేరు

0
arunn jaitley

మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉపిరి సమ్యసతో బాధపడుతున్న నేపథ్యంలో చేరిన కొన్ని రోజుల తరువాత ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 66. ఎయిమ్స్ డాక్టర్స్ మధ్యాహ్నం 12.07 గంటలకు అరుణ్ జైట్లీ మరణించినట్లు తెలిపింది.  “శ్రీ అరుణ్ జైట్లీ మరణించిన విషయాన్ని మేము చాలా బాధతో తెలియజేస్తున్నాము. గౌరవనీయ పార్లమెంటు సభ్యుడు మరియు మాజీ ఆర్థిక మంత్రి 09/08/2019 న ఢిల్లీలో సీనియర్ వైద్యుల మల్టీడిసిప్లినరీ బృందం చికిత్స అందించారు” అని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.  ఆగస్టు 9 న ఆసుపత్రికి తీసుకువచ్చిన ప్రముఖ బిజెపి నాయకుడిని లైఫ్ సపోర్ట్‌లో ఉంచారు మరియు వైద్యుల మల్టీడిసిప్లినరీ బృందం పర్యవేక్షిస్తోంది. అతను లైఫ్ సపోర్ట్‌లో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ఇంతకుముందు తెలిపాయి.  జైట్లీ యొక్క దీర్ఘకాల సహోద్యోగి మరియు బిజెపి సీనియర్ నాయకుడు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, “ఆర్థిక వ్యవస్థను చీకటి నుండి బయటకు లాగడం మరియు దానిని సరైన మార్గంలో ఉంచడం” కోసం తాను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను.  “అరుణ్ జైట్లీ జి దేశానికి అనేక సామర్థ్యాలతో సేవలందించారు మరియు అతను ప్రభుత్వానికి మరియు పార్టీ సంస్థకు ఒక ఆస్తి. ఆయనకు ఆనాటి సమస్యలపై లోతైన మరియు స్పష్టమైన అవగాహన ఉండేది.

అతని జ్ఞానం మరియు ఉచ్చారణ అతనికి చాలా మంది స్నేహితులను గెలుచుకుంది” అని రాజనాథ్ సింగ్ ట్వీట్ చేసారు.  అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి, బిజెపి చీఫ్ అమిత్ షాతో పాటు మాయావతి, జ్యోతిరాదిత్య సింధియా, నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్ వంటి రాజకీయ నాయకులు ఆసుపత్రిలో జైట్లీని సందర్శించారు.  ఈ ఏడాది మేలో చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరాడు.  బిజెపి ప్రభుత్వం మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అతను ఫైనాన్స్ మరియు డిఫెన్స్ పోర్ట్‌ఫోలియోలను కలిగి ఉన్నాడు మరియు తరచూ ప్రభుత్వ ప్రధాన ట్రబుల్షూటర్‌గా వ్యవహరించాడు.  మిస్టర్ జైట్లీ అనారోగ్యంతో 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.  గత ఏడాది మే 14 న ఎయిమ్స్‌లో రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు.  గతేడాది ఏప్రిల్ ఆరంభం నుంచి కార్యాలయానికి హాజరుకావడం మానేసిన జైట్లీ, తిరిగి ఆగస్టు 23, 2018 న ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నారు.  దీర్ఘకాలిక డయాబెటిక్ పరిస్థితి కారణంగా 2014 సెప్టెంబరులో, అతను సంపాదించిన బరువును సరిచేయడానికి బారియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

సన్నీ లియోన్ ఆమె కుమార్తె నిషా హోంవర్క్ ఆన్ వెకేషన్

0
sunny

సన్నీ లియోన్ సరదాగా గడపడానికి దుబాయ్ కి వెళ్లారు. 38 ఏళ్ల ఈ నటి, ప్రస్తుతం తన కుమార్తె నిషాతో కలిసి దుబాయ్‌లో విహారయాత్రలో ఉంది, తన కుమార్తెను, తన ఇంటి పనులను తనే కూడా పూర్తిగా సన్నీ లియోన్ చేసుకుంటుంది. సన్నీ తన కుమార్తెకు హోంవర్క్ చేస్తూ ఉన్న ఫోటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేయడం ద్వారా  వైరల్ అయింది. తల్లి-కుమార్తె ఈ ఫోటోలో కూతురు మీద సన్నీకి ఎంత ప్రేమ ఉందో మనం ఉంహించవచ్చు. సన్నీ ఈ పోస్ట్‌కు కొటేషన్ కూడా పెట్టారు: ” అయితే సెలవులో నా కుమార్తెతో అనుగుణ్యత ఉందని నేను నమ్ముతున్నాను. నేను నా కూతురు కోసం హోంవర్క్, అస్సైన్మెంట్ పూర్తి చేయడంలో ఆమెకు సహాయపడటం చాల ఆనందగా ఉంది. అది బుర్జ్ ఖలీఫా లాంటి అందమైన ప్లేస్ లో.” సన్నీ లియోన్ యొక్క పోస్ట్ ఒక గంటలోపు 3 లక్షలకు పైగా లైక్‌లను పొందింది మరియు “నైస్ మామ్ మరియు అందమైన కుమార్తె” వంటి అభిమానుల నుండి మంచి కామెంట్స్ పెడుతున్నారు.

వరుసగా రెండో సారి ఓటమి తమిళ తలైవాస్

0
U Mumba vs Tamil Thalaivas

చెన్నై: ప్రో  కబడ్డీలో  యూ ముంబా  జట్టు  29-24 పాయింట్లతో తమిళ తలైవాని  చిత్తుచేసింది. యూ ముంబా జట్టు  14 రైడ్ పాయింట్లతో  పాటు, 11 ట్యాకిల్  పాయింట్ల, 2 సార్లు  అల్ ఔట్ పాయింట్స్, అదనంగా 2 పాయింట్స్ కూడా వచ్చాయి.  తమిళ తలవాస్ జట్టు  14 రైడ్ పాయింట్లతో  పాటు, 6 ట్యాకిల్  పాయింట్ల, అదనంగా 4 పాయింట్స్  వచ్చాయి. యూ ముంబా తమిళ తలవాస్ ని రెండు సార్లు  ఆలౌట్  కూడా చేసారు. తమిళ తలైవాకి  ఈరోజు  కూడా ఓటమి  తప్పలేదు.  అతుల్ 7 మరియు  సందీప్ నర్వాల్ 5 రైడ్ పాయింట్లతో  యూ ముంబాలో  జట్లు లో కీలక  పాత్ర  పోషించారు.  తమిళ తలైవాలో  రాహుల్ చౌదరి  6  రైడ్ పాయింట్ల, అజిత్ కుమార్ 5  రైడ్ పాయింట్ల, అజయ్ ఠాకూర్ 3 రైడ్ పాయింట్స్  చేసిన  విజయం  మాత్రం  దక్కలేదు.

Latest News