Home Blog Page 3

వెస్టిండీస్ vs ఇండియా, 2 వ టెస్ట్

0
west indies vs india

ఈరోజు వెస్ట్ ఇండీస్ టూర్ లో భాగంగా సబీనా పార్క్ జమైకా లో జరుగుతున్నా సెకండ్ టెస్ట్ లో వెస్ట్ ఇండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

వెస్ట్ ఇండీస్: క్రైగ్ బ్రాత్‌వైట్, జాన్ కాంప్‌బెల్, షమర్ బ్రూక్స్, డారెన్ బ్రావో, జహ్మర్ హామిల్టన్ (w), షిమ్రాన్ హెట్మియర్, రాహకీమ్ కార్న్‌వాల్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్ (సి), కేమర్ రోచ్, షానన్ గాబ్రియేల్.

ఇండియా: లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (సి), అజింక్య రహానె, హనుమా విహారీ, రిషబ్ పంత్ (డబ్ల్యూ), రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి సతీష్ దారుణ హత్య

0
satish

రంగారెడ్డి: KPHB కాలనీలో దారుణం సాఫ్ట్ వేర్ ఉద్యోగి సతీష్ దారుణ హత్యకు  గురిఅయ్యాడు. మూసాపేటలో నివాసం ఉంటున్న సతీష్ మూడు రోజుల కిందట అదృశ్యం అయ్యాడు. ఈరోజు సతీష్ మృతదేహం KPHB  లోని హేమంత్ ఇంట్లో దొరికింది. సతీష్ మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు హేమంత్ పై అనుమానంతో కేసు నమోదు చేశారు. సతీష్ KPHB లో సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహిస్తునారు. హేమంత్ ప్రస్తుతం పరారిలో ఉన్నాడు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

నేడు ప్రపంచ వ్యాప్తంగా సాహో సినిమా విడుదల

0
saho

నేడు ప్రపంచ వ్యాప్తంగా సాహో సినిమా విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా 7వేల స్క్రీన్ లలో సినిమా ప్రదర్శన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం బాషల్లో సాహో సినిమా వేడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల దగ్గర ప్రభాస్ అభిమానుల సందడి చేస్తున్నారు.  అభిమానులు టికెట్లు బ్లాక్ లో రు. 200 ఉన్నా టికెట్ ధర రు. 2 వేలకు పైగా అమ్ముతున్నారు అని ధియేటర్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల యాజమాన్యంకు అనుమతి లేనిదే కటౌట్లు, ఫ్లేక్సీలు ఏర్పాటు చేయవద్దని, అలగానే రోడ్ల పై వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటాము అని పోలీసులు హెచ్చరించారు.

పేస్ బుక్ రాజకీయ ప్రకటన నియమాలను కఠిన నిభంధనలు చేసింది

0
Facebook tightens political ad rules

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ రాజకీయపరమైన ప్రకటనలో విషయంలో కఠిన నిభంధనలు చేసింది. 2016 కేంబ్రిడ్జ్ ఏనాలేటిక వ్యవహారంలో ఇబ్బంది పెట్టిన నేపద్యంలో పేస్ బుక్ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. 2020 అమెరికాలో జరగబోయే అధ్యక్షుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రకటనలు ఇచ్చే వ్యక్తులు పూర్తి వివరాలు ఇవ్వాలనే  నిబంధనలు కట్టుదిట్టం చేసింది. పేస్ బుక్ లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఎవరు, ఎక్కడి వారు వారి వివరాలు ఎవ్వాలిసి ఉంటుంది. ఒకవేల తగిన వివరాలు ఇవ్వకపోతే అక్టోబర్ మధ్యనాటికీ వారి యాడ్స్ నిలిపివేస్తాము అని పేస్ బుక్ తెలిపింది. ఒకవేల చిన్న వ్యాపారులు, స్థానిక రాజకీయ నేతలు కేవలం నమోదు ఫోన్ నెంబర్ తో పాటు వ్యక్తిగత సమాచారం మెయిల్ చేయటం ద్వారా యాడ్స్ ని కొనసాగించవచ్చు అని పేస్ బుక్ తెలిపింది.

అంత దైర్యం లేదు అని చెప్పిన సిని నటి త్రిష

0
unicef

రాజకీయాలలోకి వెళ్ళాలి అనే ఆసక్తిలేదు అని సిని నటి త్రిష అన్నారు. పదవుల కోసం రాజకీయాలలోకి వెళ్ళకూడదు అని అన్నారు. జీవితం మొత్తం ప్రజాసేవకు అంకితం చేస్తేనే రాజకీయాలలోకి వెళ్ళాలి అని త్రిష అభిప్రాయ పడ్డారు. తనకు అంత ఓపిక, దైర్యం లేవు అని చెప్పారు. లయోలా కళాశాలలో జరిగిన unicef ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు.  చిన్నారులు, మహిళలు పై  జరుగుతున్నా లైంగిక వేధింపులు అరికట్టడానికి ఇంక పటిష్టమైన చట్టాలు అవసరం అని త్రిష అన్నారు.

బెంగాల్ వారియర్స్ v/s తమిళ తలైవాస్

0
Bengal Warriors VS Tamil Thalaivas
ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ v/s తమిళ తలైవాస్ ఈ రోజు తలబడుతున్నాయి. పది మ్యాచ్ లు ఆడిన తమిళ తలైవాస్ కేవలం మూడు మ్యాచ్‌లోనే విజయం సాధించింది . తమిళ తలైవాస్ వరుసగా ఓటమి నుంచి ఈరోజు అయిన బయటపడుతుంది ఏమో చూడాలి. తమిళ తలైవాస్ లో రైడర్స్ గా అజయ్ ఠాకూర్, రాహుల్ చౌదరి, షబీర్ బాపు, డిఫెండర్స్ గా అజీత్, హిమాన్షు, అల్ రౌండ్ గా హేమంత్ చౌహాన్, మంజీత్ చిల్లార్ మంచి ప్రదర్శన చేస్తే తమిళ తలైవాస్ గెలిచే అవకాలు ఉన్నాయి. టాప్ రైడర్ అజయ్ ఠాకూర్ ఈ సీజన్‌లో పూర్తిగా విపలమవడం వల్ల తమిళ తలైవాస్ కి ఓటమి తప్పడం లేదు. బెంగాల్ వారియర్స్ పాయింట్స్ పట్టికలో నాలుగవ స్థానంలో లో కొనసాగుతుంది. పది మ్యాచ్ లు ఆడిన బెంగాల్ వారియర్స్ ఐదు మ్యాచ్ లో విజయం సాధించింది, రెండు మ్యాచులు టై చేసుకుంది. బెంగాల్ వారియర్స్ రైడర్స్ గా మనీందర్ సింగ్, కె. ప్రపాంజన్, రాకేశ్ నార్వాల్, డిఫెండర్స్ గా బాల్‌దేవ్ సింగ్, అల్ రౌండ్ గా మొహమ్మద్ ఎస్మాయిల్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. బెంగాల్ వారియర్స్ పై తమిళ తలైవాస్ గెలవాలి అంటే గట్టిపోటీని ఇస్తే తప్ప తమిళ తలైవాస్ గేలిచే అవకాశాలు లేవు. మనీందర్ సింగ్, కె. ప్రపాంజన్ త్వరగా ట్యకిల్ చేస్తే తమిళ తలైవాస్ గెలిచే అవకాశం ఉంది. ప్రత్యక్ష ప్రసారం కోసం 7:30 స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.
	      

దబాంగ్ ఢిల్లీ 40-24 పాయింట్స్ తో ఘన విజయం సాధించింది

0
u mumba vs dabang delhi

ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో యు ముంబాపై దబాంగ్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. యు ముంబాలో  రైడ్ పాయింట్లు 14, ట్యకిల్ పాయింట్స్ 10 చేశారు. యు ముంబా లో  అర్జున్ దేశ్వాల్ (7), సందీప్ నార్వాల్ (6), అతుల్ ఎం.ఎస్ (3), అభిషేక్ సింగ్ (2), రోహిత్ బలియన్ (1) రైడ్ పాయింట్స్ సాధించారు. ఫాజెల్ అట్రాచాలి (4), హరేంద్ర కుమార్ (1) ట్యకిల్ పాయింట్స్ చేసాడు.  దబాంగ్ ఢిల్లీ లో రైడ్ పాయింట్లు 18, ట్యకిల్ పాయింట్స్ 16, ఆలౌట్ పాయింట్స్ 6 సార్లు చేశారు. దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్ (11), రవీందర్ పహల్ (8), జోగిందర్ సింగ్ నార్వాల్ (6), చంద్రన్ రంజిత్ (4), బలరాం (2), విశాల్ మానే (1), సత్యవాన్ (1), మెరాజ్ షేక్ (1) పాయింట్స్ చేశారు.  ఆట ముగిసే టైం కి యు ముంబా 24 పాయింట్స్ మాత్రమే చేసింది. దబాంగ్ ఢిల్లీ 40 పాయింట్స్ చేసి ఘన విజయం సాధించింది. ప్రో కబడ్డీ లో వరుసగా 8 సార్లు సూపర్ 10 చేసిన పర్దీప్ నార్వాల్  తరువాత నవీన్ కుమార్ 8 సార్లు సూపర్ 10 చేసి సమానం చేసాడు.

హర్యానా స్టీలర్స్ 41-25 పాయింట్స్ తో ఘన విజయం సాధించింది

0
Gujarat Fortune Giants beat Haryana Steelers
ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ పై హర్యానా స్టీలర్స్ ఘన విజయం సాధించింది. హర్యానా స్టీలర్స్ లో రైడ్ పాయింట్లు 20, సూపర్ రైడ్స్ 2 సార్లు, ట్యకిల్ పాయింట్స్ 14, ఆలౌట్ పాయింట్స్ 6 సార్లు, అదనపు పాయింట్లు ఒకటి వచ్చింది. ప్రశాంత్ కుమార్ రాయ్(8), వికాష్ ఖండోలా (8), వినయ్ (7), రైడ్ పాయింట్స్ సాధించారు. వికాస్ కాలే (3), సునీల్ (1), ధర్మరాజ్ చెరలతన్ (1) ట్యకిల్ పాయింట్స్ చేశారు. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ లో రైడ్ పాయింట్లు (16), ట్యకిల్ పాయింట్స్ 8, అదనపు పాయింట్లు ఒకటి, ఆలౌట్ పాయింట్స్ ఒకసారి కూడా చేయలేదు. గుజరాత్ టీం లో అబోల్ఫజల్ మాగ్సోడ్లౌమహాలి (4), వినోద్ కుమార్ (3), రోహిత్ గులియా (4), మోర్ జిబి (4), రుతురాజ్ కొరవి (2), లలిత్ చౌదరి (2), సుమిత్ (2), సునీల్ కుమార్ (1), పర్వేష్ భైన్స్వాల్ (1), గుర్వీందర్ సింగ్ (1) చేసి ఆట ముగిసే టైం కి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 25 పాయింట్స్ మాత్రమే చేసింది. హర్యానా స్టీలర్స్ 41 పాయింట్స్ చేసి ఘన విజయం సాధించింది.
	      

కీచక ఉపాధ్యాయుడు బాలికలపై అసభ్య ప్రవర్తన

0
kichaka teacher

వరంగల్లోని మట్టేవాడ ప్రభుత్వ ప్రాధమిక స్కూల్ లో కీచక ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడు నాలుగవ తరగతి చదువుతున్న బాలికలపై అసభ్య ప్రవర్తన చేస్తూ దొరికిపోయాడు. విద్య బుద్దులు చెప్పాలిసిన టీచర్ ఎలాంటి పనులు చేస్తే ఆ విద్యార్తులు ఎవరితో చేపుకుంటారు. ఉపాధ్యాయుడు కి బాలిక తల్లితండ్రులు దేహశుద్ది చేశారు. పోలీసులు ఆ టీచర్ పై కేసు నమోదు చేశారు. బాలిక తల్లితండ్రులు దీనిపై కచితంగా కటిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్య శాఖ అధికారికి D.E.O దృష్టికి కూడా తీసుకెళ్ళారు.

దబాంగ్ ఢిల్లీ v/s యు ముంబా

0
dabang delhi vs u mumba
ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ v/s యు ముంబా ఈ రోజు తలబడుతున్నాయి. తోమ్మింది మ్యాచ్ లు ఆడిన దబాంగ్ ఢిల్లీ ఏడు మ్యాచ్ లో విజయం సాధించింది. దబాంగ్ ఢిల్లీలో రైడర్స్ గా నవీన్ కుమార్ (104), చంద్రన్ రంజిత్, నీరజ్ నార్వాల్, డిఫెండర్స్ గా జోగిందర్ సింగ్ నార్వాల్ (23), విశాల్ మనే, మోహిత్, అల్ రౌండ్ గా మెరాజ్ షేక్ (15) మంచి ప్రదర్శన చేస్తున్నారు. దబాంగ్ ఢిల్లీ పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో లో కొనసాగుతుంది. పది మ్యాచ్ లు ఆడిన యు ముంబా ఐదు మ్యాచ్ లో విజయం సాధించింది, ఐదు మ్యాచ్ లో ఓడిపోయింది. యు ముంబాలో రైడర్స్ గా అభిషేక్ సింగ్ (44), డాంగ్ లీ, డిఫెండర్స్ గా ఫాజెల్ అట్రాచలి (27), అల్ రౌండ్ గా సందీప్ నార్వాల్ (31) మంచి ప్రదర్శన చేస్తున్నారు. కానీ దబాంగ్ ఢిల్లీ పై యు ముంబా గెలవాలి అంటే అంత ఈజీ కాదు. నవీన్ కుమార్, చంద్రన్ రంజిత్ త్వరగా ట్యకిల్ చేస్తే యు ముంబా గెలిచే అవకాశం ఉంది. యు ముంబా పాయింట్స్ పట్టికలో ఆరవ స్థానంలో లో కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం 8:30 స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.

Latest News