Home Blog Page 2

ప్రధానమంత్రి మోదీతో బేటికానున్న జర్మనీ ఛాన్సలర్

0
German Chancellor to meet PM Modi

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ గురువారం రాత్రి రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో బేటీకానున్న జర్మనీ ఛాన్సలర్ ఏంజేలా మోర్కెల్. ఇరువురు అగ్రనేతలు మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాసం ఉంది అని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు పిటిఐకి తెలిపాయి. గురువారం రాత్రి న్యూ ఢిల్లీ చేరుకున్న తరువాత, ఏంజెలా మెర్కెల్‌ను విమానాశ్రయం నుండి ప్రధాన మంత్రి కార్యాలయంలో బస ఏర్పాటు చేసారు. మరుసటి రోజు, ఆమె రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించనుంది. గురువారం, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)తో బేటి కానున్న ఏంజేలా మోర్కెల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరంలో 5వ సారి అగ్రనేతలు సమావేశంలో పాల్గొననున్నారు.

కరీంనగర్ సిటీ మొత్తం బందుకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మికులు

0
Suspense On Funeral Of RTC Driver Babu At Karimnagar

కరీంనగర్: రేపు కరీంనగర్ సిటీ మొత్తం బందుకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మికులు. జేఏసీ నేతల ఆధ్వర్యంలో కరీంనగర్ లోని 10 డిపోలా నుంచి కార్మికులు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ బాబు కార్మికులు అంత్యక్రియలు చేయకుండా నీరవధిక ధర్నా నిర్ణయంతో నగరంలో టెన్షన్ భారీగా మోహరించిన పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ  కార్మికులను విధుల నుండి తోలిగించాము అని కేసీఆర్ నిర్ణయం వల్ల కరీంనగర్ డిపోలో పని చేస్తున్న డ్రైవర్ బాబు ఉద్యోగం తీసేసారు అని భాధతో ఆత్మాహుతి చేసుకొని చనిపోయాడు.

పవన్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కి టీడీపీ పార్టీ మద్దతు

0
TDP Party support for Pawan's Long March

విజయవాడ: విజయవాడ పర్యటనలో వైసీపీ ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 22 రకాల వృత్తులవారు ఉపాధి లేక రోడ్డున పడ్డారు అని, భాధితులపై వైసీపీ ప్రభుత్వం ఎగతాళి చేస్తున్నారు అని వ్యాక్యానించారు. ఇసుక లేక ఆత్మహత్య చేసుకున్న వారిపై ఈ ప్రభుత్వం కాలంచెల్లి చనిపోయారు అని వైసీపీ మంత్రులు ఆవహేళన చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఇసుక లేక, పనులు లేక కుటుంబాన్ని పోసించలేక కార్మికులు చనిపోతున్నారు, దీనికి కారణం వైసీపీ ఆధిపత్య విధానమే అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పవన్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కి టీడీపీ పార్టీ మద్దతు ఇస్తుంది అని,  ఇలాంటి భాధితుల విషయంలో ఎవరు నిరసన చేసిన టీడీపీ పార్టీ మద్దతిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0
Tirumala Tirupati Balaji Temple

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, 22 కంపార్ట్ మెంట్ లో నిండి ఉన్న భక్తులు. నేడు శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న ఐదేళ్ళలోపు చిన్నారుల తల్లితండ్రులకు ఉచ్చితంగా ప్రత్యక దర్శనానికి ఆనుమతి ఇచ్చిన టీటీడీ అధికారులు. నేడు శ్రీవారిని దర్శించుకున్న 48,620 మంది భక్తులు, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రు. 3.17 కోట్లు భక్తులు సమర్పించారు అని టీటీడీ అధికారులు వెల్లడించారు.

సుమారు 25 కోట్లు మోసం చేసిన ఫైనాన్స్ కంపెనీ

0
Lalitha finance

పచ్చిమగోదావరి: పాలకొల్లులో లలిత ఫైనాన్స్ కంపెనీ డిపాజిటర్లుకు సుమారు రు.25 కోట్లు మోసం చేసారు. లలిత ఫైనాన్స్ కంపెనీ అధినేత తాళ్లూరి సుబ్బారావు పై కేసు నమోదు చేసిన పోలీసులు. స్పందన కార్యక్రమంలో పచ్చిమగోదావరి జిల్లా ఏస్పీ మద్దుల వెంకటసుబ్బారావుకు భాధితులు పిర్యాదు చేసారు. లలిత ఫైనాన్స్ కంపెనీ అధినేత తాళ్లూరి సుబ్బారావు పై ఐసీసీ సెక్షన్ 420 కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం పరారిలో ఉన్నా సుబ్బారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మహా తుపాన్ ఎఫెక్ట్, రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

0
Cyclone Kerala & Tamil Nadu On High Alert

మహా తుపాన్ కన్యాకుమారి తీరప్రాంతంలో తుపానుగా మారిన అల్పపీడనం 100 నుంచి 115 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాసం ఉంది అని వాతావరణ కేంద్రం హెచ్చరించారు. కేరళ, తమిళనాడులో మహా తుపాన్ ప్రభావం ఉంటుంది అని, మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మరే అవకాసం ఉంది అని హెచ్చరించారు. కేరళలో 4 జిల్లాలు, తమిళనాడులో 3 జిల్లాలకు హెచ్చరికలు జారి చేసిన అధికారులు. కేరళలో, త్రిసూర్, ఎర్నాకులం, అలపుల, తిరువనంతపురం జిల్లాలు,తమిళనాడులో కన్యాకుమారి, తూత్తుకుడి, విరుదునగర్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. తమిళనాడు, కేరళలో కొన్ని జిల్లాలకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వా అధికారులు. మంగళూరు నుంచి కన్యాకుమారి వెళ్ళే రైళ్ళ ఆలస్యంగా నడుస్తాయి అని రైల్వే శాఖ తెలిపారు, మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లోద్దని వాతావరణ శాఖ హెచ్చరించారు.

అమ్మఒడి పథకంపై మంత్రివర్గ సమావేశంలో పాల్గొననున్న సీఎం

0
AP Amma Vodi Scheme

అమరావతి: నేడు అమరావతిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో పాల్గొననున్న వైఎస్ జగన్. 2020 జనవరి 26న ప్రారంభంకానున్న అమ్మఒడి పథకంపై మంత్రివర్గం విధి విధానాలు ఖరారుపై నిర్ణయం తీసుకోనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అంగన్ వాడి కేంద్రాల్లో పోషకాహార పథకానికి ఆమోదం తెలపనుంది, మరియు 77 మండల్లాల్లో కొత్తగా అమలు చేయనున్న పోషకాహార పథకానికి సంబధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. హజ్ మరియు జెరూసలెం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపుపై చర్చ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరో గంటలో ప్రారంభం కానున్న ఆర్టీసీ సకల జనుల సమరభేరి

0
నేడు సకల జనుల సమ్మె భేరి RTC JAC to Conduct Sakala Janula Samme Bheri at Saroornagar

హైదరాబాద్: 26వ రోజుకు చేరిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఈరోజు సకల జనుల సమరభేరికి పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసి నాయకులు. మరో గంటలలో సారూర్ నగర్ స్టేడియంలోప్రారంభం కానుంది,  ఈ సభలో హాజరుకానున్న ఆర్టీసీ జేఏసి నాయకులు, కార్మికులు. ఈ ఆర్టీసీ సమరభేరీ సభకు విపక్షాలు మద్ధతు  ఇచ్చారు. ఈ సభ పెట్టుకోవడానికి కొన్ని ఆంక్షలతో హైకోర్టు అనుమతిచింది. ఈ సకల జనుల సమరభేరిలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పై, సమ్మె ఉదృతం చేయడం, కార్మికుల భవిష్యత్ కార్యాచరణ పై మాట్లాడనున్న జేఏసి నేతలు.

నిషేధం తర్వాత, భారత్ లో జరిగే వన్డేలకు వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఎంపిక

0
Hayley Matthews return in west indies team

భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలే మాథ్యూస్ అందుబాటులో రానున్నది.  ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు 2019 సెప్టెంబర్‌లో ఎనిమిది మ్యాచ్‌ల నిషేధాన్ని మాథ్యూస్‌కు సిడబ్ల్యుఐ డిసిప్లినరీ ట్రిబ్యునల్ క్రికెట్ వెస్టిండీస్, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై  నిషేధం విధించారు. నవంబర్ 6 న భారత్ తో జరిగే మూడో వన్డే నుండి ఎంపికకు అర్హత సాధించింది. వెస్ట్ ఇండీస్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి హేలే కసరత్తు చేస్తుంది. డియాండ్రా డాటిన్ భుజం గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయింది అని సిడబ్ల్యుఐ పేర్కొంది. 2019 నుంచి విండీస్ జట్టులో ఆల్ రౌండర్ల  కోసం ఎటువంటి చర్య తీసుకోలేదు. 2020 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో జరిగే ఐసిసి ఉమెన్స్ టి-20 వరల్డ్ కప్ లో పాల్గొనడానికి డాటిన్ పూర్తి ఫిట్‌నెస్‌ తో జట్టులో తిరిగివస్తాను అని ధీమా వ్యక్తం చేసింది.

Latest News