అవుకు రిజర్వాయర్ కు జలకల

0
182
owk reservoir

కర్నూలు: పోతిరెడ్డిపాడు ఇరిగేషన్ రిజర్వాయర్ నుంచి వెలుగోడు రిజర్వాయర్ కు అక్కడి నుండి అవుకు మండలంలోని అవుకు రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు. దాని ద్వారా అవుకు జలాశయo నిండు కుండలా మారనుంది. గాలేరు మరియు నగరి కలువ ద్వారా ఇన్ఫ్లో 11,500 క్యూసెక్కులు, కడప జిల్లాకు 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. అవుకు రిజర్వాయర్ ప్రస్తుత నీటినిల్వ 2.60 టీఎంసీ నీరు ఉంది. దీని ద్వారా చాలా గ్రామాలకు త్రాగునీరు అవసరాలు తీరుతాయి. రాబోయే రోజులలో బనగానపల్లె, అవుకు, ప్యాపిలి మండలంలోని అన్ని గ్రామాలకు త్రాగునీటికి సరఫరా చేస్తాము అని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.