కొత్త రక్తానికి పార్టీలో ప్రాధాన్యత!: టీడీపీ

0
21
Nara Chandrababu Naidu

విశాఖ: ఇకపై టీడీపీ తమ పార్టీలో కొత్త రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుందని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వ వచ్చాకా మందు బాబుల దగ్గర కూడా జే-ట్యక్స్ వసూలు చేస్తున్నారు. పార్టీ సంస్థగత ఎన్నికలలో మహిళలు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇస్తాము అని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలంగాణ మీదుగా గోదావరి జలాలను తీసుకోనివెళ్తాం అంటున్నారు, ఇది ఇద్దరు సీఎంలకు సంబంధించిన విషయం కాదు అని వ్యాక్యనించారు. పోలవరంలో రు.750 కోట్లు అదా చేశామని చెపుతూ, రివర్స్ టెండరింగ్ ద్వారా 7 వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారు. గత ఐదేళ్ళలో మా ప్రభుత్వంలో ఎప్పుడు విధ్యుత్ సమస్యరాలేదు, కానీ జగన్ ప్రభుత్వహయంలో రోజు కరెంటు కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు