చంద్రుని పై భారత్ కల?

0
40
Chandrayaan 2

ఇస్రో: చంద్రయాన్-2 చివరి క్షణాలలో ల్యాండార్ నుంచి  ఇస్రోకి మధ్య సిగ్నల్ సమస్య వచ్చింది. ఈ సమస్యను రావడానికి గల కారణాలను ఇస్రో శాస్రవేత్తలు పరిస్కరిస్తున్నాం అని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు. చంద్రయాన్-2 ప్రయోగం ఇంకో 2 నిమిషాలలో జాబిల్లి పై లాండింగ్ అవుతుంది అనుకున్న సమయంలో సిగ్నల్ సమస్య రావడం వల్ల నిరాశచెందినా ఇస్రో శాస్రవేత్తలు. యావత్ దేశం మొత్తం చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావాలి ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది. బెంగుళూరులోని ఇస్రో  కేంద్రం నుంచి చంద్రుని పై విక్రమ్ ల్యాండింగ్ ని విక్షి౦చిన ప్రధాని మోది. కానీ ల్యాండర్ కి ఇస్రోకి మధ్య సిగ్నల్ అందడం లేదు. ఎందుకు ఈ సమస్య వచ్చింది అని ప్రధానమంత్రి మోది కి వివరించినా ఇస్రో శాస్రవేత్తలు. తరువాత ఇస్రో కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోది మాట్లాడారు. విజయం కోసం భారత శాస్రవేత్తలు తీవ్రంగా కృషి చేశారు అని ప్రధాని మోది అన్నారు. మన కలలను సాకారం చేసేందుకు ప్రయత్నంచారు. యావత్ దేశం మీ వెంట ఉంటుందంటూ శాస్రవేత్తలకు దైర్యం చెప్పిన ప్రధాని. దేశం మొత్తం ఇస్రో కి మద్దతుగా నిలిచారు.