నిషేధం తర్వాత, భారత్ లో జరిగే వన్డేలకు వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఎంపిక

0
32
Hayley Matthews return in west indies team

భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలే మాథ్యూస్ అందుబాటులో రానున్నది.  ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు 2019 సెప్టెంబర్‌లో ఎనిమిది మ్యాచ్‌ల నిషేధాన్ని మాథ్యూస్‌కు సిడబ్ల్యుఐ డిసిప్లినరీ ట్రిబ్యునల్ క్రికెట్ వెస్టిండీస్, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై  నిషేధం విధించారు. నవంబర్ 6 న భారత్ తో జరిగే మూడో వన్డే నుండి ఎంపికకు అర్హత సాధించింది. వెస్ట్ ఇండీస్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి హేలే కసరత్తు చేస్తుంది. డియాండ్రా డాటిన్ భుజం గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయింది అని సిడబ్ల్యుఐ పేర్కొంది. 2019 నుంచి విండీస్ జట్టులో ఆల్ రౌండర్ల  కోసం ఎటువంటి చర్య తీసుకోలేదు. 2020 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో జరిగే ఐసిసి ఉమెన్స్ టి-20 వరల్డ్ కప్ లో పాల్గొనడానికి డాటిన్ పూర్తి ఫిట్‌నెస్‌ తో జట్టులో తిరిగివస్తాను అని ధీమా వ్యక్తం చేసింది.