గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ v/s హర్యానా స్టీలర్స్

0
11
Gujarat Fortunegiants and Haryana Steelers

ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ v/s హర్యానా స్టీలర్స్ ఈ రోజు తలబడుతున్నాయి. పోయిన మ్యాచ్ లో విజయం సాదించిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు ఈరోజు హర్యానా స్టీలర్స్ పై కూడా ఎలాగా అయిన గెలవాలని చూస్తుంది. సునీల్ కుమార్, రోహిత్ గులియా, హర్మంజిత్ సింగ్, పర్వేష్ భైన్స్వాల్ మంచి ప్రదర్శన చేస్తే హర్యానా స్టీలర్స్ పై గెలిచే అవకాశం ఉంది గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో లో కొనసాగుతుంది.అయితే హర్యానా స్టీలర్స్ మాత్రం వరుసగా రెండు విజయాలతోమంచి ప్రదర్శన చేస్తుంది. గుజరాత్ పై కూడా గెలిచి తన జైత్రయాత్ర కొనసాగించాలి అని హర్యానా స్టీలర్స్ చూస్తుంది. రైడర్స్ గా వికాష్ కండోలా (69), నవీన్, మొహమ్మద్ మలేకి, డిఫెండర్స్ గా ధర్మరాజ్ చెరలథన్(22), సునీల్ రానిస్తే హర్యానా స్టీలర్స్ గెలిచే అవకాశాలుఎక్కువగా ఉన్నాయి. హర్యానా స్టీలర్స్ పాయింట్స్ పట్టికలో 5వ స్థానంలో లో కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం 7:౩౦ స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.