ప్రధానమంత్రి మోదీతో బేటికానున్న జర్మనీ ఛాన్సలర్

0
36
German Chancellor to meet PM Modi

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ గురువారం రాత్రి రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో బేటీకానున్న జర్మనీ ఛాన్సలర్ ఏంజేలా మోర్కెల్. ఇరువురు అగ్రనేతలు మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాసం ఉంది అని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు పిటిఐకి తెలిపాయి. గురువారం రాత్రి న్యూ ఢిల్లీ చేరుకున్న తరువాత, ఏంజెలా మెర్కెల్‌ను విమానాశ్రయం నుండి ప్రధాన మంత్రి కార్యాలయంలో బస ఏర్పాటు చేసారు. మరుసటి రోజు, ఆమె రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించనుంది. గురువారం, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)తో బేటి కానున్న ఏంజేలా మోర్కెల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరంలో 5వ సారి అగ్రనేతలు సమావేశంలో పాల్గొననున్నారు.