పేస్ బుక్ రాజకీయ ప్రకటన నియమాలను కఠిన నిభంధనలు చేసింది

0
32
Facebook tightens political ad rules

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ రాజకీయపరమైన ప్రకటనలో విషయంలో కఠిన నిభంధనలు చేసింది. 2016 కేంబ్రిడ్జ్ ఏనాలేటిక వ్యవహారంలో ఇబ్బంది పెట్టిన నేపద్యంలో పేస్ బుక్ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. 2020 అమెరికాలో జరగబోయే అధ్యక్షుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రకటనలు ఇచ్చే వ్యక్తులు పూర్తి వివరాలు ఇవ్వాలనే  నిబంధనలు కట్టుదిట్టం చేసింది. పేస్ బుక్ లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఎవరు, ఎక్కడి వారు వారి వివరాలు ఎవ్వాలిసి ఉంటుంది. ఒకవేల తగిన వివరాలు ఇవ్వకపోతే అక్టోబర్ మధ్యనాటికీ వారి యాడ్స్ నిలిపివేస్తాము అని పేస్ బుక్ తెలిపింది. ఒకవేల చిన్న వ్యాపారులు, స్థానిక రాజకీయ నేతలు కేవలం నమోదు ఫోన్ నెంబర్ తో పాటు వ్యక్తిగత సమాచారం మెయిల్ చేయటం ద్వారా యాడ్స్ ని కొనసాగించవచ్చు అని పేస్ బుక్ తెలిపింది.