ఇంగ్లాండ్ మూడవ టెస్ట్ లో విజయం

0
52
stoke

ఇంగ్లాండ్: మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 179 పరుగులు చేసింది. తరువాత ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండుని 67 స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసింది ఆస్ట్రేలియా. అదే రోజు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగులో ఓపెనింగ్ చేసిన మార్నస్ లాబుస్చాగ్నే 19(39), డేవిడ్ వార్నర్ 0(2) ఎక్కువ స్కోర్ చేయకుండానే అవుట్ అయ్యారు. ఉస్మాన్ ఖవాజా 23(38), మార్నస్ లాబుస్చాగ్నే 80(187), ట్రావిస్ హెడ్ 25(56), మాథ్యూ వాడే 33(59) పరుగులు చేసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్ళారు. ఆస్ట్రేలియా 246 పరగులు చేసింది. ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్ కలిపి 358 పరుగుల టార్గెటును ఇంగ్లాండుకి ఇచ్చింది. సెకండ్ ఇన్నింగులో ఓపెనింగ్ చేసిన రోరే బర్న్స్ 7(21), జాసన్ రాయ్ 8(18) అవుట్ అవడంతో ఆదిలోనే ఇంగ్లాండుకి ఎదురు దెబ్బ తగిలింది ఎక్కవ పరుగులు చేయకుండానే ఆస్ట్రేలియా బౌలర్స్ అవుట్ చేశారు. తరువాత వచ్చిన రూట్ 77(205), డెన్లీ 50(155) ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యంతో స్కోర్ ని ముందుకు తీసుకోని వెళ్లారు. తరువాత వచ్చిన జానీ బెయిర్‌స్టో 36(68) పరుగులు చేసి అవుట్ అయ్యాడు, కానీ బెన్ స్టోక్స్ 135(219) ఒంటరి పోరాటం చేసి ఇంగ్లాండు విజయం సాదించడం లో కీలకపాత్ర వహించాడు. ఇంగ్లాండుకి ఇంకా ఒక వికెట్ ఉండగానే మూడవ టెస్ట్ లో విజయం సాదించింది. ఇంగ్లాండ్ 1-1 తో సిరీస్‌ను సమం చేసింది. నాలుగో టెస్ట్‌ మాంచెస్టర్‌ వేదికగా వచ్చే నెల నాలుగో తేదీ ప్రారంభమవుతుంది.