జైపూర్ పింక్ పాంథర్స్ v/s దబాంగ్ ఢిల్లీ కేసి

0
50
Dabang Delhi K.C vs Jaipur Pink
బెంగళూరు: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో జైపూర్-పింక్-పాంథర్స్ v/s దబాంగ్ ఢిల్లీ కేసి ఈ రోజు తలబడుతున్నాయి. పన్నెండు మ్యాచ్ లు ఆడిన జైపూర్-పింక్-పాంథర్స్ ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించింది, ఐదు మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. జైపూర్-పింక్-పాంథర్స్ పాయింట్స్ పట్టికలో ఐదవ స్థానంలో లో కొనసాగుతుంది. జైపూర్ వరుసగా ఓటమి నుంచి ఈరోజు అయిన బయటపడుతుంది ఏమో చూడాలి. జైపూర్ లో రైడర్స్ అజింక్య పవర్, దీపక్ నర్వాల్, డిఫెండర్స్ గా సందీప్ కుమార్ అల్ రౌండ్ గా దీపక్ నివాస్ హుడా మంచి ప్రదర్శన చేస్తే జైపూర్ గెలిచే అవకాలు ఉన్నాయి. దబాంగ్ ఢిల్లీ పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో తన జైత్రయాత్ర కొనసాగుతుంది. దబాంగ్ ఢిల్లీ రైడర్స్ గా నవీన్ కుమార్, చంద్రన్ రంజిత్, నీరజ్ నార్వాల్, డిఫెండర్స్ గా జోగిందర్ సింగ్ నార్వాల్, మోహిత్, విశాల్ మనే, అల్ రౌండ్ గా మెరాజ్ షేక్ జట్టులో ప్రతి ఒక్కరు మంచి ప్రదర్శన చేస్తున్నారు. వరుస విజయాల మీద ఉన్నదబాంగ్ ఢిల్లీపై జైపూర్ పింక్ పాంథర్స్ గెలవాలి అంటే గట్టిపోటీని ఇస్తే తప్ప జైపూర్ గేలిచే అవకాశాలు లేవు. నవీన్ కుమార్, చంద్రన్ రంజిత్, జోగిందర్ సింగ్ త్వరగా ట్యకిల్ చేస్తే జైపూర్ గెలిచే అవకాశం ఉంది. నవీన్ కుమార్ వరుసగా సూపర్ 10 చేస్తూ దబాంగ్ ఢిల్లీ జట్టు గెలవడం లో కీలకపాత్ర వహిస్తున్నాడు. ప్రత్యక్ష ప్రసారం కోసం 7:30 స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.