మహా తుపాన్ ఎఫెక్ట్, రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

0
27
Cyclone Kerala & Tamil Nadu On High Alert

మహా తుపాన్ కన్యాకుమారి తీరప్రాంతంలో తుపానుగా మారిన అల్పపీడనం 100 నుంచి 115 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాసం ఉంది అని వాతావరణ కేంద్రం హెచ్చరించారు. కేరళ, తమిళనాడులో మహా తుపాన్ ప్రభావం ఉంటుంది అని, మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మరే అవకాసం ఉంది అని హెచ్చరించారు. కేరళలో 4 జిల్లాలు, తమిళనాడులో 3 జిల్లాలకు హెచ్చరికలు జారి చేసిన అధికారులు. కేరళలో, త్రిసూర్, ఎర్నాకులం, అలపుల, తిరువనంతపురం జిల్లాలు,తమిళనాడులో కన్యాకుమారి, తూత్తుకుడి, విరుదునగర్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. తమిళనాడు, కేరళలో కొన్ని జిల్లాలకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వా అధికారులు. మంగళూరు నుంచి కన్యాకుమారి వెళ్ళే రైళ్ళ ఆలస్యంగా నడుస్తాయి అని రైల్వే శాఖ తెలిపారు, మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లోద్దని వాతావరణ శాఖ హెచ్చరించారు.