మహా తుఫాన్ ఎఫెక్ట్, వాతావరణ శాఖ హెచ్చరికలు

0
86
MAHA Cyclone in Tamilnadu

చెన్నై: మహా తుఫాన్ ప్రభావంతో బీభత్సం సృష్టించే అవకాసం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారిచేసింది. మహా తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మరీ, కేరళ, దక్షిణ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోయంబత్తూర్, తిరునల్వేరి, రామనాతపురం, సేలం, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విరిగిపడిన భారీ వృక్షాలు, పలు ప్రాంతాలు జలమయం, రహదారులు కూడా దెబ్బతిన్నాయి. మంగళూరు నుంచి కన్యాకుమారి వెళ్ళే రైళ్ళ ఆలస్యంగా నడుస్తాయి అని రైల్వే శాఖ తెలిపారు, మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లోద్దని వాతావరణ శాఖ హెచ్చరించారు. నీలగిరి జిల్లాల్లో విరిగిపడ్డ కొండచరియలు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, కన్యాకుమారి, తిరునల్వేరి జిల్లాల్లో పర్యాటక జలపాతాలు మూసివేసిన అధికారులు. ఈ నెల 3న బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ప్రభావంతో డెల్టా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతాయి అని వాతావరణ శాఖ తెలిపింది.