బెంగళూరు బుల్స్ v/s పాట్నా పైరేట్స్

0
79
bengaluru bulls vs patna pirates
బెంగళూరు: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో బెంగళూరు బుల్స్ పాట్నా పైరేట్స్ ఈ రోజు తలబడుతున్నాయి. పాట్నా పైరేట్స్ జట్టు వరుస ఓటమితో సతమతమవుతుంది. ఈరోజు బెంగళూరు బుల్స్ పై ఎలాగా అయిన గెలవాలని పాట్నా పైరేట్స్ చూస్తుంది. పాట్నా పైరేట్స్ లో పర్దీప్ నార్వాల్, ఆశిష్, జాంగ్ కున్ లీ, డిఫెండర్స్ గా జైదీప్, అల్ రౌండ్ గా హడి, మంచి ప్రదర్శన చేస్తే బెంగళూరు బుల్స్ పై గెలిచే అవకాశం పాట్నా పైరేట్స్ కి ఉంది. పాట్నా పైరేట్స్ పాయింట్స్ పట్టికలో లాస్ట్ స్థానంలో లో కొనసాగుతుంది. పోయిన మ్యాచ్ లో తమిళ తైలవాస్ పై బెంగళూరు బుల్స్ ఘన విజయం సాధించింది. పాట్నా పైరేట్స్ పై కూడా గెలిచి తన జైత్రయాత్ర కొనసాగించాలి అని బెంగళూరు బుల్స్ చూస్తుంది. రైడర్స్ గా రోహిత్ కుమార్, పవన్ కుమార్ సెహ్రావత్ డిఫెండర్స్ గా మహేందర్ సింగ్, విజయ్ కుమార్, అల్ రౌండ్ గా ఆశిష్ కుమార్ సూపర్ ప్రదర్శన చేస్తున్నారు. ఈ సీజన్ లో ఎక్కువ రైడ్ పాయింట్స్ చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో స్థానంలో పవన్ కుమార్ సెహ్రావత్ 148 పాయింట్స్ చేసాడు. బెంగళూరు బుల్స్ పాయింట్స్ పట్టికలో 4వ స్థానంలో లో కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం 8:30 స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.