బెంగళూరు బుల్స్ v/s గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్

0
21
Bengaluru Bulls vs Gujarat Fortune Giants copy
బెంగళూరు: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో బెంగళూరు బుల్స్ గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఈ రోజు తలబడుతున్నాయి. పోయిన మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ పై గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు ఓడిపోయింది. ఈరోజు బెంగళూరు బుల్స్ పై ఎలాగా అయిన గెలవాలని చూస్తుంది. గుజరాత్ లో రోహిత్ గులియా ,అబోల్ఫజల్ డిఫెండర్స్ గా సునీల్ కుమార్, పర్వేష్ భైన్స్వాల్, అల్ రౌండ్ గా పంకజ్, వినోద్ కుమార్ మంచి ప్రదర్శన చేస్తే బెంగళూరు బుల్స్ పై గెలిచే అవకాశం గుజరాత్ జట్టు కి ఉంది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్  పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో లో కొనసాగుతుంది. పోయిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ పై బెంగళూరు బుల్స్ ఘన విజయం సాధించింది. గుజరాత్ పై కూడా గెలిచి తన జైత్రయాత్ర కొనసాగించాలి అని బెంగళూరు బుల్స్ చూస్తుంది. రైడర్స్ గా రోహిత్ కుమార్, పవన్ కుమార్ సెహ్రావత్ డిఫెండర్స్ గా మహేందర్ సింగ్, విజయ్ కుమార్, అల్ రౌండ్ గా ఆశిష్ కుమార్ సూపర్ ప్రదర్శన చేస్తున్నారు. ఈ సీజన్ లో ఎక్కువ రైడ్ పాయింట్స్ చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో నవీన్ కుమార్ 130 పాయింట్స్, 2వ స్థానంలో పవన్ కుమార్ సెహ్రావత్ 128 పాయింట్స్ చేసాడు.ఈరోజు పవన్ కుమార్ రెండు పాయింట్స్ చేస్తే నవీన్ కుమార్ రైడ్ పాయింట్స్ కి సమానం చేస్తాడు. బెంగళూరు బుల్స్ పాయింట్స్ పట్టికలో 5వ స్థానంలో లో కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం 7:30 స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.