అమ్మఒడి పథకంపై మంత్రివర్గ సమావేశంలో పాల్గొననున్న సీఎం

0
35
AP Amma Vodi Scheme

అమరావతి: నేడు అమరావతిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో పాల్గొననున్న వైఎస్ జగన్. 2020 జనవరి 26న ప్రారంభంకానున్న అమ్మఒడి పథకంపై మంత్రివర్గం విధి విధానాలు ఖరారుపై నిర్ణయం తీసుకోనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అంగన్ వాడి కేంద్రాల్లో పోషకాహార పథకానికి ఆమోదం తెలపనుంది, మరియు 77 మండల్లాల్లో కొత్తగా అమలు చేయనున్న పోషకాహార పథకానికి సంబధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. హజ్ మరియు జెరూసలెం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపుపై చర్చ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.