దబాంగ్ ఢిల్లీ v/s యు ముంబా

0
92
dabang delhi vs u mumba
ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ v/s యు ముంబా ఈ రోజు తలబడుతున్నాయి. తోమ్మింది మ్యాచ్ లు ఆడిన దబాంగ్ ఢిల్లీ ఏడు మ్యాచ్ లో విజయం సాధించింది. దబాంగ్ ఢిల్లీలో రైడర్స్ గా నవీన్ కుమార్ (104), చంద్రన్ రంజిత్, నీరజ్ నార్వాల్, డిఫెండర్స్ గా జోగిందర్ సింగ్ నార్వాల్ (23), విశాల్ మనే, మోహిత్, అల్ రౌండ్ గా మెరాజ్ షేక్ (15) మంచి ప్రదర్శన చేస్తున్నారు. దబాంగ్ ఢిల్లీ పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో లో కొనసాగుతుంది. పది మ్యాచ్ లు ఆడిన యు ముంబా ఐదు మ్యాచ్ లో విజయం సాధించింది, ఐదు మ్యాచ్ లో ఓడిపోయింది. యు ముంబాలో రైడర్స్ గా అభిషేక్ సింగ్ (44), డాంగ్ లీ, డిఫెండర్స్ గా ఫాజెల్ అట్రాచలి (27), అల్ రౌండ్ గా సందీప్ నార్వాల్ (31) మంచి ప్రదర్శన చేస్తున్నారు. కానీ దబాంగ్ ఢిల్లీ పై యు ముంబా గెలవాలి అంటే అంత ఈజీ కాదు. నవీన్ కుమార్, చంద్రన్ రంజిత్ త్వరగా ట్యకిల్ చేస్తే యు ముంబా గెలిచే అవకాశం ఉంది. యు ముంబా పాయింట్స్ పట్టికలో ఆరవ స్థానంలో లో కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం 8:30 స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.