బెంగాల్ వారియర్స్ v/s తమిళ తలైవాస్

0
45
Bengal Warriors VS Tamil Thalaivas
ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ v/s తమిళ తలైవాస్ ఈ రోజు తలబడుతున్నాయి. పది మ్యాచ్ లు ఆడిన తమిళ తలైవాస్ కేవలం మూడు మ్యాచ్‌లోనే విజయం సాధించింది . తమిళ తలైవాస్ వరుసగా ఓటమి నుంచి ఈరోజు అయిన బయటపడుతుంది ఏమో చూడాలి. తమిళ తలైవాస్  లో రైడర్స్ గా అజయ్ ఠాకూర్, రాహుల్ చౌదరి, షబీర్ బాపు, డిఫెండర్స్ గా అజీత్, హిమాన్షు, అల్ రౌండ్ గా హేమంత్ చౌహాన్, మంజీత్ చిల్లార్ మంచి ప్రదర్శన చేస్తే తమిళ తలైవాస్ గెలిచే అవకాలు ఉన్నాయి. టాప్ రైడర్ అజయ్ ఠాకూర్ ఈ సీజన్‌లో పూర్తిగా విపలమవడం వల్ల  తమిళ తలైవాస్ కి ఓటమి తప్పడం లేదు. బెంగాల్ వారియర్స్ పాయింట్స్ పట్టికలో నాలుగవ స్థానంలో లో కొనసాగుతుంది. పది మ్యాచ్ లు ఆడిన బెంగాల్ వారియర్స్  ఐదు మ్యాచ్ లో విజయం సాధించింది,  రెండు మ్యాచులు టై చేసుకుంది. బెంగాల్ వారియర్స్  రైడర్స్ గా మనీందర్ సింగ్, కె. ప్రపాంజన్, రాకేశ్ నార్వాల్, డిఫెండర్స్ గా బాల్‌దేవ్ సింగ్, అల్ రౌండ్ గా మొహమ్మద్ ఎస్మాయిల్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. బెంగాల్ వారియర్స్ పై తమిళ తలైవాస్ గెలవాలి అంటే గట్టిపోటీని ఇస్తే తప్ప తమిళ తలైవాస్ గేలిచే అవకాశాలు లేవు. మనీందర్ సింగ్, కె. ప్రపాంజన్ త్వరగా ట్యకిల్ చేస్తే తమిళ తలైవాస్ గెలిచే అవకాశం ఉంది. ప్రత్యక్ష ప్రసారం కోసం 7:30 స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును.