ప్రపంచ ఛాంపియన్‌షిపులో స్వర్ణ పతకం సాధించిన పివి సింధు

0
96
PV Sindhu

ఆదివారం జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2019 లో స్వర్ణ పతకం సాధించడానికి పివి సింధు 21-7, 21-7 తో జపాన్ నుంచి మూడో సీడ్ లో ఉన్న నోజోమి ఒకుహారా పై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదవ సీడ్ లో ఉన్న పివి సింధు 2017, 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మెరుగైన ప్రదర్శనలను చూసాము. అదే మెరుగైన ఆటతో మార్క్యూ టోర్నమెంట్‌ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న తొలి భారతీయురాలుగ పివి సింధు నిలిచింది. పివి సింధు మొదటి సెట్లో చెమట పట్టకుండా ఆటను 16 నిమిషాల్లో ముగించింది. మరోవైపు నోజోమి ఒకుహారాని, పివి సింధు ఛాంపియన్‌షిప్ ని కైవసం చేసుకోవడానికి ఆమెకు 38 నిమిషాలు పట్టింది. పివి సింధు ఫైనల్‌లో గెలవడానికి నోజోమి లోపాలను టార్గెట్ చేసి ఫైనల్ లో గెలిచింది. 2016 ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన సింధు, గతంలో ఇండోనేషియా ఓపెన్ 2019 లో జపానియులను ఓడించింది. ఆట ప్రారంభం నుంచి సింధు మ్యాచ్‌ను పూర్తిగా నియంత్రిచింది. ఆమె వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించింది. ఒకుహారా భారత ప్రత్యర్థికి ఎటువంటి తీవ్రమైన సవాలును ఇవ్వడంలో విఫలమైంది. రెండవ గేమ్‌లో,క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ 1 తాయ్ జూ యింగ్ ఓడించిన సింధు, ప్రారంభంలోనే తనఅధిపత్యం ప్రదర్శిస్తూ,వరుసగా ఏడు పాయింట్లు సాధించింది. దీనితో సింధు ఫైనల్‌ను సులభంగా గెలుచుకుంది.