Home Blog

ఢిల్లీ పర్యటనలో డీజీపీ కన్నుమూత

0
Goa Director General Of Police Pranab Nanda Dies Of Heart

ఈరోజు ఉదయం గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ప్రణవ్ నందా గుండెపోటుతో మరణించారు. ఐజి జస్పాల్ సింగ్ ఇది మాకు చాలా విచారకరం మరియు కలతపెట్టే’  వార్త అని ఆయన అన్నారు. ప్రణవ్ నందా 1988 ఐపిఎస్ బ్యాచ్ కు చెందినా అధికారి, అరుణాచల్, మిజోరాం మరియు ఇతర కేంద్రపాలిత ప్రాంతాలకు తనసేవలు అందించారు. ఈ ఏడాది మార్చిలో గోవా డిజిపిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో బాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొనే సమయంలో గుండెపోటుతో ప్రణబ్ నందా మృతి చెందారు.

రెండు వర్గాల మధ్య ఘర్షణ, నలుగురికి తీవ్ర గాయాలు: కర్నూలు

0
Conflict Between Two Groups Orvakallu For Drinking Water

కర్నూలు: ఈరోజు ఉదయం ఓర్వకల్లులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నేతలను కాలనివాసులు త్రాగునీరు సమస్యని పరిష్కరించాలని అడిగినందుకు కాలనివాసులపై దాడి చేసిన నేతలు, అధికారులు. ఇరు వర్గాలు కర్రలు, బండరాళ్లతో పరస్పరం డాడి చేసుకున్న కాలని వాసులు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు పాలయ్యాయి, గాయా పడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థావరానికి చేరుకొని ఘర్షణ అదుపు చేసారు, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేసారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా: SVU

0
Sri Venkateswara University

తిరుపతి: తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు ఒక చోట కేటాయించి OMR షీట్లు, మరో కాలేజ్ కి పంపించిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధికారులు. పిలేరులో పరీక్షా కేంద్రాలలో విద్యార్థికి కేటాయించిన నామినర్ రోల్స్  నెంబర్ల ను మరో సెంటరకు పంపిన యూనివర్సిటీ అధికారులు. నామినర్ రోల్స్ లేకుండా పరీక్ష రాయించలేమని చేతులెత్తేసిన కాలేజ్ యాజమాన్యాలు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు SV యూనివర్సిటీ అధికారులతో వాగ్వాడానికి దిగారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెలా గోపిచంద్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

0
Pullela Gopichand birthday special

పుల్లెలా గోపిచంద్ నవంబర్ 16, 1973 లో  పుల్లెల సుబాష్ చంద్ర మరియు సుబ్బరవమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నాగండ్లాలో జన్మించారు. పుల్లెలా గోపిచంద్ కి మొదట్లో క్రికెట్ అంటే బాగా ఇష్టం, కానీ అతని అన్నయ్య బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకోవడానికి ప్రోత్సహించడం వల్ల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గా క్యారియర్ మొదలుపెట్టారు. ప్రస్తుతం, అతను భారత బ్యాడ్మింటన్ జట్టుకు చీఫ్ నేషనల్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అతను 2001 లో ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు, ప్రకాష్ పడుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడు పుల్లెలా గోపిచంద్. బ్యాడ్మింటన్ నుండి రిటైర్ అయిన తరువాత, 2008 లో గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించాడు. ఈ అకాడమీలోనే సైనా నెహ్వాల్, పి. వి. సింధు, సాయి ప్రణీత్, పరుపల్లి కశ్యప్, శ్రీకాంత్ కిడాంబి, అరుంధతి పాంటవానే, గురుసాయ్ దత్ మరియు అరుణ్ విష్ణులతో సహా అనేక మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను తాయారు చేసారు. సైనా నెహ్వాల్ 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, పి.వి.సింధు 2016 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజత పతకం. గోపీచంద్ 2016 బ్రెజిల్ రియో ​​ఒలింపిక్‌లో అధికారిక భారత ఒలింపిక్ బ్యాడ్మింటన్ జట్టు కోచ్‌గా కూడా పనిచేశారు. అతని క్రీడా ప్రతిభకు భారత ప్రభుత్వం 1999 లో అర్జున అవార్డు, 2001 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2005 లో పద్మశ్రీ, 2009 లో ద్రోణాచార్య అవార్డు, 2014లో పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది.

ఆస్ట్రేలియా vs శ్రీలంక, 3వ టి-20

0
Australia vs Sri Lanka 3nd T20

శ్రీలంక టూర్ లో భాగంగా ఈరోజు మెల్బోర్న్ స్టేడియం జరుగుతుంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుంది.

డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), స్టీవెన్ స్మిత్, బెన్ మెక్‌డెర్మాట్, అష్టన్ టర్నర్, అలెక్స్ కారీ (wk), అష్టన్ అగర్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జాంపా.

కుసల్ పెరెరా (wk), కుసల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, అవిష్కా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, భానుకా రాజపక్సే, ఓషాడా ఫెర్నాండో, లక్షన్ సందకన్, లసిత్ మలింగ (సి), నువాన్ ప్రదీప్, లాహిరు కుమార.

మహా తుఫాన్ ఎఫెక్ట్, వాతావరణ శాఖ హెచ్చరికలు

0
MAHA Cyclone in Tamilnadu

చెన్నై: మహా తుఫాన్ ప్రభావంతో బీభత్సం సృష్టించే అవకాసం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారిచేసింది. మహా తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మరీ, కేరళ, దక్షిణ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోయంబత్తూర్, తిరునల్వేరి, రామనాతపురం, సేలం, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విరిగిపడిన భారీ వృక్షాలు, పలు ప్రాంతాలు జలమయం, రహదారులు కూడా దెబ్బతిన్నాయి. మంగళూరు నుంచి కన్యాకుమారి వెళ్ళే రైళ్ళ ఆలస్యంగా నడుస్తాయి అని రైల్వే శాఖ తెలిపారు, మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లోద్దని వాతావరణ శాఖ హెచ్చరించారు. నీలగిరి జిల్లాల్లో విరిగిపడ్డ కొండచరియలు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, కన్యాకుమారి, తిరునల్వేరి జిల్లాల్లో పర్యాటక జలపాతాలు మూసివేసిన అధికారులు. ఈ నెల 3న బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ప్రభావంతో డెల్టా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతాయి అని వాతావరణ శాఖ తెలిపింది.

మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

0
YSR Aarogyasri poster launch today

ఈరోజు తాడేపల్లిగూడెం పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లిగూడెంలోని క్యాంపు ఆఫీస్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం పోస్టర్ ని విడుదల చేస్తారు. ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ  కేవలం రాష్ట్రలో ఉన్న హాస్పటల్ లో మాత్రమే వైద్యం చేసుకునే అవకాశం ఉన్నది, కానీ కొత్తగా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ఇతర రాష్ట్రాలలో కూడా ఆరోగ్య శ్రీ సేవలు వర్తింపచేసే పోస్టర్ ను అవిష్కరించనున్న సీఎం జగన్. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రులు, ఉన్నతాధికారులు.

బంగాళాఖాతం వైపుగా దూసుకువస్తున్న తుపాను

0
Heavy Rain Bangala Katham

బంగాళాఖాతం వైపుగా దూసుకువస్తున్న మత్మో తుపాను. దక్షిణ చైనా సముద్రం వైపు నుంచి బంగాళాఖాతం వైపుగా మత్మో తుపాన్ ఈ వారంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిక జారి చేసారు. ఈ తుపాను తీవ్ర వాయుగుండంగా మరే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ తెలిపింది.  బంగాళాఖాతంలో ఈ నెల 3న ఏర్పడనున్న అల్పపీడనం ద్రోణి, ఈ ద్రోణి ప్రభావంతో 100 నుండి 200 కిలోమీటర్ల వేగంతో ఇదురు గాలులు విస్తాయి అని వాతావరణ కేంద్ర హెచ్చరించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం, గవర్నర్

0
The Governor of the state and the Chief Minister of the day of the celebration

నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. లబ్బీపేటలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో అవతరణ దినోత్సవ వేడుకలు జరపనున్నారు. సాయంత్రం జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు మంత్రులు వేడుకల్లో పాల్గొననున్నారు. స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులను, బంధువులను సత్కరించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, అనంతరం సాంస్కృతిక  కార్యక్రమాలను వీక్షించనున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.

Latest News