Home Blog

లంచ్ టైంకి మూడు వికెట్స్ కోల్పోయిన భారత్

0
Pacers strike early to leave India

రాంచీ: భారత్ v/s సౌత్ఆఫ్రికా మూడవ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ 3వ టెస్ట్ లో కూడా విజయం సాధించాలని చూస్తుంది. భారత్ సల్ప మార్పులతో బరిలోకి దిగనున్నది, ఇషాంత్ శర్మ స్థానంలో షాబాజ్ నదీంకు చోటు దక్కింది. మొట్టమొదటి సరిగా ఇంటర్ నేషనల్ టెస్ట్ లోకి అరంగ్రేటం చేసిన షాబాజ్ నదీంను సగర్వంగా టీంలోకి ఆహ్వానించిన కెప్టెన్ కోహ్లి. అగర్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ వచ్చాక ఎక్కువ స్కోర్ చేయకుండానే అగర్వాల్ 10(19) రబడ బౌలింగ్ లో ఎల్గర్ కి క్యాచ్ ఇచ్చాడు, తరువాత వచ్చిన పూజార 0(9), కోహ్లి 12 (22) తక్కువ పరుగులకు ఔట్ అయ్యారు.  ఇండియా లంచ్ టైంకి 71/3 స్కోర్ చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ 38 (68), రహనే 11(20) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

20 మందికి పైగా నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

0
RTC strike with illegal arrests in nijamabad

నిజామాబాద్: నిజామాబాద్ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, బంద్ కు వామపక్షాలు, కార్మికుల సంఘాలు మద్దతు తెలిపారు. వామపక్షాలు, కార్మికుల డిపో ప్రదర్శనకు వచ్చిన కార్మికులను అడ్డుకున్న పోలీసులు. పోలీసులు వామపక్షాల నేతలు తోపులాట, 20 మందికి పైగా నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ నాయకుల ఇళ్ళను చుట్టుముట్టిన పోలీసులు వి. అనుమంతరావు, మధు యాష్కీ, కూన శ్రీశైలం గౌడ్  ఇళ్ళ ముందు వాళ్ళు బయటకు రాకుండా పోలీసులు మోహరింపు.

రాబోయే 24 గంటలలో భారీ నుండి అతి భారీ వర్ష సూచనా

0
Heavy rainfall forecast in AP

అమరావతి: రాబోయే 24 గంటల వరకు వర్ష సూచనా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, పచ్చిమగోదావరి, విజయనగరం,కృష్ణ, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షంతో పాటు 40 కి.మీ వేగంతో గాలులు విస్తాయి అని, ప్రజలు జాగ్రతగా ఉండి, పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు అని అధికారులు హెచ్చరించారు.

భారీ వర్షలు పడటంతో అతలాకుతలం అయిన ఉత్తరాంధ్ర

0
Heavy Rains to Uttarandhra today

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడ్డాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం పడటంతో, నదులు, వాగులు, వంకలు భారీగా పొర్లుతున్నాయి.  విజయనఃనగరం, శ్రీకాకుళం మోస్తరు వర్షాలు, మరో 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకశం ఉంది అని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

కార్మికుల సమ్మె ఎఫెక్ట్ ఎటు కదలని బస్సులు

0
TSRTC unions to strike 15th day

హైదరాబాద్: 15వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుంటుంది. ఆర్టీసీ జేఏసీ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్, అందుకు అన్ని సంఘాల నాయకుల మద్దతుపలికారు. బంద్ కు విపకక్షాలు, ఉద్యోగులు, విద్యార్ధి సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ మద్దతుగా తెలంగాణ డ్రైవర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ముందస్తు అరెస్టులు, తెలంగాణలోని అన్ని బస్టాండ్ ఎదుట భారీ పోలీసులు మొహరించారు. ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ సమ్మె విరమిస్తేనే చర్చలు ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశం అవుతాము అని కెసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో జరిగిన మంత్రులు, అధికారుల సమావేశంలో అన్నారు. నిన్న హైకోర్టు మాత్రం ఆర్టీసీ కార్మికులతో చర్చలు  జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారి చేసింది, అప్పటికే కోర్టు టైం ముగియడంతో కోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి ఈరోజు అందే అవకాసం ఉంది.

ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0
TIRUMALA

తిరుపతి: తిరుమలలో బ్రహ్మోత్సవాలు అయిపోవడంతో భక్తుల రద్దీ సాధారంగా ఉంది,  భక్తులు 17 కంపార్ట్ మెంట్ లో నిండి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది అని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,661, శ్రీవారి హుండీ ఆదాయం రు.3.05 కోట్లు భక్తులు సమర్పించారు అని టీటీడీ అధికారులు తెలిపారు.

ఏపీసెట్ నిర్వహించాలని యూజీసీ ఆదేశం

0
Andhra University, Visakhapatnam

విశాకపట్నం: యూజీసీ ఆదేశాలతో ఆంద్ర యూనివర్సిటీలో ఏపీసెట్ నిర్వహించాలని ఆంద్రవర్సిటీ వీపీ ప్రసాదరెడ్డి అన్నారు. ఈ నెల 20న 8 కేంద్రాలలో ఏపీసెట్ నిర్వహించాలని ఆదేశం. ఇప్పటి వరకు ఏపీసెట్ పరీక్షల కోసం 30,020 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అని యూనివర్సిటీ వీపీ ప్రసాదరెడ్డి వెల్లడించారు. ఈ నెల 22న వెబ్ సైట్ లో ఏపీసెట్ సంభందించిన ప్రాధమిక కీ ఉంచుతాం అని అన్నారు. ఈ నెల 24న సాయంత్రం 5 గంటల వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటె తెలపాలని ఆంద్ర యూనివర్సిటీలో వీపీ ప్రసాదరెడ్డి తెలిపారు

కాటన్ వ్యాపారి ఇంటిపై దాడి చేసిన ఎమ్మేల్యే అనుచరులు

0
YCP MLA

గుంటూరు: గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు. కాటన్ వ్యాపారి ఇంటిపై దాడి చేసిన పల్నడు ప్రాంత వైసీపీ నేతలు. ఆతుకూరి కబ్జారావు ఇంట్లో ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన ఎమ్మేల్యే అనుచరులు. ఇంట్లో ఉన్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన వైసీపీ ఎమ్మేల్యే అనుచరులమంటూ వీరంగం సృష్టించిన దండుగులు. బ్రాడీపేటలోని వైట్ ఫిల్డ్ అపార్ట్ మెంట్ పై ఒక్క సరిగా అందరు దాడి చేసారు. ఆతుకూరి కబ్జారావు ఇంట్లో ఫర్నిచర్ పటు, దండుగులను అడ్డుకోబోయిన స్థానికులపై కూడా దాడి చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినా పోలీసులు. ఆర్థిక లావాదేవిల విషయంలోనే వివాదం, తన వద్ద నుంచి అధిక సొమ్ము వసూలు చేశాడంటూ కోర్టును ఆశ్రయించిన కబ్జారావు. మొన్న వరకు నెల్లూరు జిల్లా వైసీపీ నేతల ఎంపీడీఒ సరళపై శ్రీదర్ రెడ్డి దౌర్జన్యం వ్యవహారం పై ఇప్పటికే నేతలపై సీఎం జగన్ సిరియస్ గా ఉన్నారు.

డీజీపీని కలిసిన జర్నలిస్ట్ సంఘాల నాయకులు

0
AP DGP Gautam Sawang

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిసిన ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు. రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై అనేక దాడులు, హత్యలు జరుగుతున్నాయి, వాటిని నివారించాలనీ కోరిన  ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు. గుంటూరు జిల్లాలోని తుని రూరల్ రిపోర్టర్ సత్యనారాయణ హత్యలో నిందుతులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరిన జర్నలిస్ట్ సంఘాల నాయకులు.

Latest News